సినిమా ఇండస్ట్రీలో చాలామంది చాలా పాత్రలు వేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు, కొంతమంది మాత్రం అనుకోని కారణాల వలన కొన్ని ఆక్సిడెంట్లకు గురై బతికున్నంత కాలం వీల్ చైర్ల కే పరిమితమై బతికిన కొంతమంది గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
నూతన ప్రసాద్
బాపు తీసిన అందాల రాముడు సినిమా తో నటుడుగా పరిచయమైన నూతన ప్రసాద్ ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సాధించాడు.101 జిల్లాల అందగాడుగా పేరు తెచ్చుకొని మంచి సినిమాలు చేసుకుంటూ తనదైన క్యారెక్టరైజేషన్ తో ముందుకు సాగుతూ ఉండేవాడు.విలన్ గా చేస్తూనే చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేశాడు.అయితే ఒకరోజు రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన బామ్మ మాట బంగారు బాట సినిమాలో కార్ పైనుంచి కింద పడే ఒక షార్ట్ తీసే క్రమంలో ఆ కార్ కు తాడు కట్టి పైకి లేపారు.
అనుకోకుండా తాళ్లు తెగి కార్ కింద పడడంతో దాంట్లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ మొత్తానికి తప్పించుకున్నాడు.కానీ అందులోనే ఉన్న నూతన ప్రసాద్ కి మాత్రం దెబ్బలు తగిలి తర్వాత అతని కాళ్లు పనికిరాకుండా పోయాయి.
దాంతో బతికినంతకాలం వీల్ చైర్ కె పరిమితం అయిపోయాడు.అలాగే ఆయన కొన్ని సినిమాల్లో కూడా నటించాడు చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసి మంచి గుర్తింపును సాధించారు.
అను అగర్వాల్

అప్పట్లో హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుని కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసిన అను అగర్వాల్ స్వతహాగా మంచి అందగత్తె, ఆమె తీసిన ఆషికి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆమెకి మంచి క్రేజ్ వచ్చింది.ముఖ్యంగా యూత్ లో ఆ మంచి ఫాలోయింగ్ ఉండేది.ఆ క్రేజ్ తోనే చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.ముఖ్యంగా మణిరత్నం తీసిన దొంగ దొంగ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ని పోషించి తనదైన నటనతో మంచి గుర్తింపును సాధించింది, ఆ తర్వాత చాలా సినిమాల్లో నటిస్తూ జనాల్ని మెప్పిస్తూ వచ్చింది.
అయితే అనుకోకుండా ఒక రోజు కార్ యాక్సిడెంట్ జరగడంతో ఆమె 20 రోజుల పాటు కోమాలో ఉండిపోయింది.బ్రతకదు అనుకున్న సమయంలో డాక్టర్లు శాయశక్తులా కృషి చేసి బ్రతికించారు.
ఇప్పుడు ఆమె బాడీ లో ఉన్న చాలా పార్ట్స్ కి రాడ్లు వేసే ఉంటాయి.అలాంటి అను అగర్వాల్ అప్పుడున్న అందాన్ని కోల్పోవడంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి.
దాంతోనే బీహార్లో ఉన్న ఒక యోగ కేంద్రంలో యోగ నేర్చుకుని ప్రస్తుతం పవర్ లిఫ్టర్ గా చేస్తున్నారు.ఏదైనా మంచి క్యారెక్టర్ దొరికితే ప్రస్తుతం సినిమాలు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
విద్యాసాగర్

ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే జంధ్యాల గారు తీసిన చాలా సినిమాల్లో మనకు విద్యాసాగర్ కనిపిస్తూ ఉంటాడు.అలాంటి విద్యాసాగర్ చాలా సినిమాల్లో నటించి అందరినీ మెప్పించాడు.అయితే ఆయనకి యాక్సిడెంట్ అయితే జరగలేదు కానీ పక్షవాతం రావడంతో ఒక కాలు, ఒకచేయి పనిచేయకుండా పోయాయి.దాంతో ఆయన ప్రస్తుతం విల్ చైర్ లో కూర్చుని నాటకాలను డైరెక్ట్ చేస్తున్నారు.
ఆయన భార్య కూడా యాక్టర్ అవడంతో ఆయనకి హెల్ప్ చేస్తూ ప్రస్తుత జీవితాన్ని గడుపుతున్నారు.ఆయన భార్య రత్న చాలా సినిమాల్లో సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపును సాధించారు.
ఒకప్పుడు మంచి నటులుగా గుర్తింపు పొంది వాళ్ల జీవితంలో జరిగిన సంఘటనల వల్ల సినిమా అవకాశాలు కోల్పోయి, ఒంటరిగా జీవితంతో యుద్ధం చేస్తూ సినిమా కాకుండా వేరే పనుల్లో బిజీగా ఉంటూ, వాళ్లకు జరిగిన యాక్సిడెంట్ అనేది మనల్ని ఏం చేయలేదు అని వాళ్ల సంకల్పబలంతో వాళ్ళు పని చేస్తు జీవితాన్ని గడుపుతు మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తున్నారు.