మెయిన్ రోడ్ కు మోక్షం తారు పనులు ప్రారంభం...!

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారి మెయిన్ రోడ్ విస్తరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విస్తరణ పనులకు మోక్షం లభించింది.గత వారం రోజుల నుండి జరుగుతున్న విస్తరణ పనుల్లో భాగంగా గురువారం ఉదయం తారు రోడ్డు వేసే ప్రక్రియ వేగవంతం చేశారు.

 Moksham Asphalt Work Has Started For The Main Road...!-TeluguStop.com

ఇంతకాలం గుంతల మట్టి రోడ్డులో రాకపోకలు లేక, మడిగలు ఖాళీగా ఉండి వ్యాపారాలు కుంటుపడి, కిరాయిలు కట్టలేక కొందరుంటే,స్వంత దుకాణాలు నడిపేవారు కూడా అప్పుల పాలైన పరిస్థితి దాపురించింది.విస్తరణ పనులు మొదలైన తరువాత వ్యాపారులు సంతోషంగా కనిపిస్తున్నారు.

తారు రోడ్డు వేయడంతో మెయిన్ రోడ్ రూపు రేఖలు మొత్తం మారిపోయాయి.ఇకపై మడిగలు అద్దెకు దొరికే పరిస్థితి లేదు.

పూలసెంటర్,బొడ్రాయి బజార్ రోడ్డులో పూజ వస్తువులు,స్టీల్,రాతెండి, ఇత్తడి,బంగారు నగలు, బట్టల దుకాణాలు కస్టమర్ లతో కళకళలాడుతాయని వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube