దళిత బంధు అక్రమాలకు పాల్పడ్డ ఎమ్మెల్యేలను ఏసిబికి అప్పగించాలి:ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్

దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు 3 లక్షలు లంచం తీసుకున్నారని, వారి చిట్టా తన దగ్గర ఉందని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, వారిని ఎందుకు ఏసీబీకి అప్పగించకుండా తన దగ్గర పెట్టుకున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.

ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.సోమవారం మునుగోడు మండల కేంద్రంలో జూనియర్ పంచాయితీ సెక్రటరీలు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత బంధు పంపిణీలో అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.పునర్నిర్మాణం అంటే ఒక తరాన్ని అభివృద్ధి చేయడమని,మీ ఫాం హౌస్ లకు నీరు తెచ్చుకోవడం కాదని అన్నారు.

దళిత బంధు పథకంలో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని,ఎమ్మెల్యేలు ఒక్కొక్కరి వద్ద మూడు లక్షల లంచం తీసుకున్నారని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించినప్పటికి వారందరిని ఏసిబికి ఎందుకు అప్పగించడం లేదన్నారు.పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్లు అమ్ముకొని 30 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు.

పంటల భీమా పథకం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని,ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న కేసీఆర్ లో చలనం లేదన్నారు.పునర్నిర్మాణ తెలంగాణలో సమ్మెలు చేయని ఉద్యోగులు లేరని విఆర్వోలు,విఆర్ఏలు, విఏఓలు,ఆర్టిజన్లు, జిపిఎస్,ఓపిఎస్ లు, ఆర్టీసి కార్మికులు ప్రతి ఒక్కరు సమ్మెలు ధర్నాలు చేస్తున్నారని అన్నారు.

Advertisement

ఆర్టిజనలపై ఎస్మా చట్టం పెట్టారని,కానీ కెసిఆర్ పై ఎస్మా చట్టం పెట్టాలని డిమాండ్ చేశారు.జూనియర్ పంచాయితీ కార్యదర్శుల సమ్మెకు సంఘీభావం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్ ను ప్రభుత్వం అమలు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

మూడు సంవత్సరాలుగా వెట్టి చాకిరి చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత లేదని,నిన్న 5 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసినపుడు,ఈ పంచాయితీ కార్యదర్శులు ఎందుకు గుర్తురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వాస్తవానికి ప్రొహిబిషన్ పీరియడ్ రెండు సంవత్సరాలకు మించి ఉండరాదని,అయినా నిబంధనలకు విరుద్దంగా మూడు సంవత్సరాలు పెట్టి,చట్ట విరుద్దంగా మరో సంవత్సరం పొడిగించడం సరైంది కాదన్నారు.

పంచాయితీ రాజ్ శాఖ మంత్రికి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మాత్రమే తెలుసునని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడం తెలీదని విమర్శించారు.జూనియర్ పంచాయతీ కార్యదర్శల న్యాయమైన డిమాండ్ లను వెంటనే నెరవేర్చకపోతే బీఎస్పి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు పూదరి సైదులు,జిల్లా ఇంచార్జి గోవర్ధన్,మహిళా రాష్ట్ర నాయకురాలు నిర్మల,జిల్లా మహిళ కన్వీనర్ కవిత నియోజకవర్గ ఇంచార్జి శంకరాచారి,నియోజకవర్గ అధ్యక్షులు నాగెంద్ర, ఏర్పుల అర్జున్, పరశురాం,మండల నాయకులు సైదులు వెంకట్,హరీష్ లు పాల్గొన్నారు.

తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌... సూర్యాపేటకు 6వ స్థానం
Advertisement

Latest Suryapet News