భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం: ఎమ్మెల్యే మందుల సామేల్

సూర్యాపేట జిల్లా: పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఖిల్లా మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని,కారు మళ్ళీ నుజ్జు నుజ్జు కావడం ఖాయమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నూతనకల్ మండల కేంద్రంలో మద్దిరాల,నూతనకల్ మండలాల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ ఆదివారం నూతనకల్ మండల కేంద్రంలో జరిగే కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ కి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.భువనగిరిలో రెండు లక్షల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని,బీఆర్ఎస్ పార్టీ పొల్లు పొల్లుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు.6 గ్యారంటీల గురించి ప్రజలకు వివరించాలన్నారు.

 Congress Flag Will Be Hoisted On Bhuvanagiri Fort Mla Mandula Samuel, Congress F-TeluguStop.com

ఏ గ్రామంలో చూసినా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని,ఏ గ్రామంలో చూసినా ఇందిరమ్మ ఇళ్ళు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే కనిపిస్తున్నాయన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలే పేదల బతుకుల్లో వెలుగులు నింపాయన్నారు.

మాయ మాటలు చెప్పి మధ్యలో వచ్చిన తోక పార్టీలు గల్లంతవ్వడం కొద్ది రోజుల్లోనే ఉందన్నారు.బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర పన్నుతున్నారని,రాజ్యాంగం మీద దాడి చేయాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు.

భారతదేశంలో రిజర్వేషన్ రహిత దేశాలుగా మార్చాలని కుట్ర జరుగుతుందన్నారు.కాంగ్రెస్ వస్తే ఎస్సీ,ఎస్టీలకు జనాభా ప్రతిపదిక రిజర్వేషన్లు ఇస్తామన్నారు.అలాగే గతంలో కేసీఆర్ కూడా రాజ్యాంగం రద్దు చేసి కొత్త రాజ్యాంగం రాసుకోవాలని అన్నారని, కెసిఆర్ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube