టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఇంకా ఎన్నాళ్లు హైదరాబాద్ ని రాజధానిగా చూస్తారంటూ ప్రశ్నించారు.
బెంగళూరు, హైదరాబాద్, చెన్నైకి ఉపాధి కోసం వెళ్తాం.మనకి పౌరుషం లేదా.? ఆత్మగౌరవం లేదా.? ఆత్మవిశ్వాసం లేదా.? రాజధాని నిర్మించుకోలేమా.? పక్క రాష్ట్రాల యువత ఏపీకి వచ్చి ఉద్యోగాలు చేసేలా పరిశ్రమలు తీసుకురాలేమా.? 62 ఏళ్లు కష్టపడి హైదరాబాద్ ( Hyderabad ) అభివృద్ధి చేసుకున్నాం.అలాంటి రాజధాని మళ్లీ కట్టుకుందాం.
హైదరాబాదులో కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు.అదే పరిస్థితి మన రాష్ట్రంలో కల్పించుకుందాం.
ఆ దిశగా అందరం అడుగులు వేద్దాం.అప్పుడు ఇతర రాష్ట్రాల నుండి ఏపీలో ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది.
ఈ క్రమంలో త్వరలో జరగబోయే ఎన్నికలలో ఎన్డీఏ కూటమిని( NDA Alliance ) గెలిపించాలని లోకేష్ అభ్యర్థించడం జరిగింది.ఏపీలో ఎన్నికలకు( AP Elections ) ఇంకా పది రోజులు కూడా సమయం లేదు.మే 13వ తారీకు పోలింగ్.దీంతో నారా లోకేష్ భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఈసారి కూడా మంగళగిరి నియోజకవర్గం( Mangalagiri ) నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.ఈ ఎన్నికలలో కచ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని లోకేష్ భావిస్తున్నారు.
దీంతో మంగళగిరి నియోజకవర్గంలో మొన్నటివరకు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడపడం జరిగింది.అనంతరం ఇప్పుడు యువగళం పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
శనివారం రాజంపేటలో.యువగళం నిర్వహించడం జరిగింది.