సూర్యాపేట జిల్లా: సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది.ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ (గుంటకండ్ల జగదీష్ రెడ్డి), బీజేపీ సంకీనేని (వెంకటేశ్వరరావు),(బీఎస్పీ వట్టే జానయ్య యాదవ్)అభ్యర్థులు కావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారంలో పోటాపోటీగా దూసుకెళుతున్నారు.
కానీ, కాంగ్రెస్ పార్టీలో ఇంకా అభ్యర్దిని ప్రకటించక పోవడంతో హస్తం శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.ఇక్కడి నుండి రామిరెడ్డి దామోదర్ రెడ్డి,పటేల్ రమేష్ రెడ్డి( Ramireddy Damodar Reddy, Patel Ramesh Reddy ) మధ్య పోటీ నెలకొనడంతో అభ్యర్ధి ప్రకటన ఆలస్యం అవుతుంది.
దీనితో కాంగ్రెస్ పార్టీలో ప్రచార జాడలు కనిపించడం లేదు.ఇక అధికార పార్టీ అభ్యర్ధి మంత్రి జగదీశ్ రెడ్డి ( Minister Jagdish Reddy )వరుసగా రెండుసార్లు విక్టరీ కొట్టి హ్యాట్రిక్ కోసం సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
మంత్రితో ప్రధాన అనుచరుడు వట్టే జానయ్య యాదవ్ మంత్రితో విభేదించి బీఎస్పీలో చేరి,బీఎస్పి అభ్యర్ధిగా బరిలో నిలిచారు.ప్రతీ రోజూ నిత్యం ఓటర్లను దగ్గరికి వెళ్లి బహుజనవాదాన్ని గెలిపించాలని,తనను ఆశీర్వదించాలని ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.
ప్రజలు కూడా ఆయనకు మద్దతుగా పార్టీలో వందలాదిగా చేరుతున్నారు.ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులు,కార్యకర్తలు రాజీనామా చేసి బీఎస్పీ లోకి చేరుతున్నారు.
కులాలవారీగా ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో బీఎస్పీ అభ్యర్థితో పాటు అతని సతీమణి రేణుక, తల్లి ఐలమ్మ కూడా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు.బీజేపీ అభ్యర్ధి సంకినేని తనదైన శైలితో ప్రచారంలో ఉన్నారు.
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు,మోడీ మ్యానియా,మంత్రి అవినీతిపై అస్త్రాలు సంధిస్తూ ప్రచారం చేస్తున్నారు.కానీ,ఇక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయని నమ్ముతున్న కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్దిని ప్రకటించక, ప్రచారం చేయక చతికిల పడిందని,ఇంకా ఆలస్యం అయితే కాంగ్రెస్ నుండి భారీగా వలసలు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఇప్పకైనా కాంగ్రెస్ మెల్కోకపోతే గత ఎన్నికల వచ్చిన రిజల్ట్ పునరావృత్తం అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.పరిస్థితి ఇలాగే ఉంటే మంత్రి వర్సెస్ వట్టే జానయ్య యాదవ్ మధ్యే ప్రధాన పోటీ ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి
.