కార్యదర్శి గదికి తాళం వేసిన సర్పంచ్

సూర్యాపేట జిల్లా:అధికార టీఆర్ఎస్ నాయకుల తొత్తుగా గ్రామ సెక్రటరీ పనిచేస్తున్నారని ఓ గ్రామ మహిళా సర్పంచ్ ఆరోపిస్తూ కార్యదర్శి ఆఫీస్ కి తాళం వేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం కరివిరాల గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.

 The Sarpanch Locked The Secretary's Room-TeluguStop.com

ఈ గ్రామం కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్వగ్రామం కావడంతో అందరికి సుపరిచితమే.అధికార టీఆర్ఎస్ నుండి తొలిసారి కోదాడ ఎమ్మెల్యేగా గెలుపొందిన మల్లయ్య యాదవ్ కు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన స్వగ్రామంలో ఎదురుదెబ్బ తగిలింది.

కరివిరాల గ్రామ ప్రజలు కాంగ్రేస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిని గ్రామ సర్పంచిగా గెలిపించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పంచాయితీ తీర్పు ఇచ్చారు.ఇక అప్పటి నుండి గ్రామ సర్పంచిగా గెలుపొందిన నీలిమ గాంధీ అనే మహిళా సర్పంచ్ కు ప్రతీ విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

స్థానిక అధికార పార్టీ నాయకులు గ్రామాభివృద్ధిలో అడుగడుగునా అడ్డుకుంటూ ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అనేక సార్లు మీడియా,సోషల్ మీడియా ద్వారా అనేక కథనాలు వెలుగు చూశాయి.ఒకవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు సృష్టిస్తున్న అడ్డంకులను అధిగమిస్తూ తనదైన శైలిలో గ్రామ పంచాయతీ పాలనను ముందుకు తీసుకెళుతున్న మహిళా సర్పంచ్ కు మరోవైపు గ్రామ కార్యదర్శి వ్యవహారం తలనొప్పిగా మారిందని సర్పంచ్ నీలిమ గాంధీ సోమవారం అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యదర్శి ఆఫీస్ కు తాళం వేయడంతో కరివిరాల మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

ఈ సందర్భంగా మహిళా సర్పంచ్ నీలిమ గాంధీ మాట్లాడుతూ గ్రామంలోని 3వ,వార్డులో నీటి సమస్య ఉన్నదని,ఆ సమస్య పరిస్కారం చేయడం కోసం గ్రామ పంచాయతీ బిల్లులు త్వరగా పరిష్కారం చేసే విధంగా చూడాలని ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సెక్రటరీతో చెప్పానని,మీరు మండలానికి వెళ్లి బిల్లులు చేసుకొని రావచ్చని చెప్పడంతో మండల ఆఫీస్ కు వెళ్లి,బిల్లుల యొక్క ఓటీపీ చెప్పమని సెక్రటరీ కాల్ చేయగా డీపీఓ మీకు ఓటీపీ చెప్పవద్దన్నారని చెప్పడంతో షాక్ కు గురయ్యానన్నారు.తిరిగి తాను కార్యదర్శితో మాట్లాడేందుకు గ్రామానికి చేరుకునే లోపే గ్రామంలోని 3 వార్డులో కొంతమంది మహిళలను కూడగట్టి గ్రామ పంచాయతీ వద్దకు ఖాళీ బిందెలతో రావాలని సూచించి,సర్పంచ్ వచ్చేలోగా గ్రామంలోని టీఆర్ఎస్ నాయకులతో కలిసి గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేయించడం జరిగిందని ఆరోపించారు.

ధర్నా చేస్తున్న మహిళలకు సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నా విరమించారన్నారు.ధర్నా విరమణ అనంతరం సర్పంచ్ గ్రామ సెక్రటరీతో గ్రామంలోని 3వ,వార్డులోని నీళ్ల సమస్య పరిష్కారం కోసం మోటారుకు కావలిసిన సామాగ్రి తీసుకొని వచ్చి సమస్య పరిష్కారం చేద్దామని సెక్రటరీతో చెప్పడంతో 10 నిముషాలలో వస్తానని చెప్పి కంటికి కానరాకుండా పోయారని ఆవేదన వ్వక్తం చేశారు.

ఇదంతా కార్యదర్శి కావాలనే చేస్తున్నారన్నారు.అందుకే తనకేమీ పట్టనట్లు నటిస్తూ తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని వాపోయారు.

గ్రామ అధికార పార్టీ నాయకులు ఆడుతున్న రాజకీయ చదరంగంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కార్యదర్శి పావుగా మారారని అన్నారు.గ్రామ ప్రజల అవసరాలు తీర్చాల్సిన పోస్ట్ లో ఉండి, సర్పంచ్ కు వ్యతిరేకంగా పని చేసే కార్యదర్శి తనకు, గ్రామానికి అవసరం లేదని,అందుకే ఆయన కార్యాలయానికి తాళం వేశామని తెలిపారు.

కార్యదర్శి విధి నిర్వహణపై ఉన్నతాధికారులు స్పందించి శాఖాపరమైన విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube