మోతె మండలంలో అన్నదాతల అధ్వాన్నస్థితి

సూర్యాపేట జిల్లా:మోతె మండల( Mothey mandal ) వ్యాప్తంగా వానా కాలం వరి పంటలో మంచి దిగుబడి రావడంతో రైతులు యాసంగి కూడా బోర్లు,బావులపై అధారపడి అధిక మొత్తంలో వరి సాగు చేసి, ఎకరానికి రూ.20వేల వరకు పంట పెట్టుబడి పెట్టారు.తీరా పొట్ట దశకు వచ్చేసరికి బోర్లలో నీళ్లు లేక,కళ్ళముందే ఎండుతున్న పంటను చూసి తట్టుకోలేక కొత్తగా బోర్లు వేయడం మొదలుపెట్టారు.

 Poor Condition Of Breadwinners In Mothey Mandal  , Mothey Mandal, Suryapet Distr-TeluguStop.com

భూగర్భ జలాలు( Ground water ) అడుగంటి బోర్లు వేసినా చుక్క నీరు రాకపోవడంతో మరింత అప్పుల ఊబిలో చిక్కుకొని దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

పంటలు కాపాడేందుకు భగీరథ ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోవడంతో చేసేదేమీ లేక ఎకరం 2 వేల చొప్పున పశువుల మేతకు ఇస్తున్నట్లు వాపోతున్నారు.మండలంలో పంట నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube