BRS MLC Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ..!!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha )కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

కవిత పిటిషన్ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది.

ఆరు వారాల్లోగా ఈడీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.కాగా కవిత తరపున న్యాయవాదులు కపిల్ సిబల్, విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు.

ఈ క్రమంలోనే కవిత లేవనెత్తిన అంశాలను గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు ధర్మాసనం జత చేసింది.బెయిల్ తాము ఇవ్వలేమన్న సుప్రీం కోర్టు( Supreme Court ) బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam Case )లో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత

తాజా వార్తలు