మోతె మండలంలో అన్నదాతల అధ్వాన్నస్థితి

సూర్యాపేట జిల్లా:మోతె మండల( Mothey Mandal ) వ్యాప్తంగా వానా కాలం వరి పంటలో మంచి దిగుబడి రావడంతో రైతులు యాసంగి కూడా బోర్లు,బావులపై అధారపడి అధిక మొత్తంలో వరి సాగు చేసి, ఎకరానికి రూ.

20వేల వరకు పంట పెట్టుబడి పెట్టారు.తీరా పొట్ట దశకు వచ్చేసరికి బోర్లలో నీళ్లు లేక,కళ్ళముందే ఎండుతున్న పంటను చూసి తట్టుకోలేక కొత్తగా బోర్లు వేయడం మొదలుపెట్టారు.

భూగర్భ జలాలు( Ground Water ) అడుగంటి బోర్లు వేసినా చుక్క నీరు రాకపోవడంతో మరింత అప్పుల ఊబిలో చిక్కుకొని దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

పంటలు కాపాడేందుకు భగీరథ ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోవడంతో చేసేదేమీ లేక ఎకరం 2 వేల చొప్పున పశువుల మేతకు ఇస్తున్నట్లు వాపోతున్నారు.

మండలంలో పంట నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

చంద్రబాబు హామీలపై ఇన్ని అనుమానాలు ఉన్నాయా ?