విజయ డెయిరీ వింత మోసం...!

యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లా వ్యాప్తంగా ఒకవైపు కల్తీ పాల దందా వెలుగులోకి వస్తుంటే మరోవైపు యాదగిరిగుట్ట( Yadagirigutta ) పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర పాడి‌ పరిశ్రమాభివృద్ది సహకార సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ పాల డెయిరీకి చెందిన పాల శీతలీకరణ కేంద్రంగా కొందరు సిబ్బంది రైతులతో కలిసి సరికొత్త పాల దందాకు తెరలేపారు.వివరాల్లోకి వెళితే… విజయ డెయిరీ పాల( Vijaya Dairy Milk ) శీతలీకరణ కేంద్రంలో పని చేసే సిబ్బంది కొందరు రైతులతో కుమ్మక్కై రైతులకు పాడి గేదెలు, ఆవులు లేకున్నా వారి పేరుపై ప్రతీ రోజూ ఉదయం,సాయంత్రం కలిపి దాదాపు 100 లీటర్ల పాలు కేంద్రంలో పోస్తున్నట్లుగా రికార్డులలో నమోదు చేస్తూ పాల కల్తీకి తెరలేపినట్లు అదే డెయిరీలో ప్రతిరోజు పాలు పోసే రైతు శ్రీకాంత్ రెడ్డి అనే యువ రైతు ఆధారాలతో సహా బయటపెట్టడంతో డెయిరీ మేనేజర్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

 Vijaya Dairy Is A Strange Fraud , Vijaya Dairy ,yadagirigutta-TeluguStop.com

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి శనార్తితో మాట్లాడుతూ గుండ్లపల్లికి చెందిన రైతుకు గతంలో గేదెలు ఉండగా రోజు 100 లీటర్ల వరకు పాలు పోసేవారు.అలాంటిది ఆ రైతుకు ప్రస్తుతం గేదెలు లేకున్నా కూడా ప్రతిరోజు పాలు పోస్తున్నట్లుగా రిజిస్టర్ లో నమోదు చేయడంతో పాటు అకౌంట్ లో డబ్బులు కూడా వేసినట్లు తెలిపాడు.

ఇలా గత రెండు,మూడు నెలలుగా జరుగుతుందని అంటే దాదాపుగా నెలకు లక్ష నుండి లక్షా యాభైవేల వరకు దోపిడీ జరుగుతుందని పేర్కొన్నాడు.ఇలా నెలల తరబడి ఎంతమంది పేరుపై ఇలాంటి మోసానికి పాల్పడుతున్నారో?ఎన్ని లక్షల ప్రభుత్వ సొమ్మును కాజేశారో అని వాపోయారు.ఇదే విషయమై డెయిరీ డిడికి కూడా ఫిర్యాదు చేసిననట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపాడు.ఈ విషయమై డెయిరీ మేనేజర్ మహేష్ కుమార్ ను వివరణ కోరగా సదరు రైతు డెయిరీలో పాలు పోయకున్నా పోసినట్లు రాసింది నిజమేనని సిబ్బందిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube