సూర్యాపేట జిల్లా: బహిరంగా ప్రదేశాల్లో మధ్యం తాగడం నేరం, సమాజంలో సామాజిక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే పట్టణ న్యూసెన్స్ కేసులు తప్పవని,ఇలాంటి వారిపై గత మూడు నెలలుగా 1350 కేసులు నమోదు చేయడం జరిగినదని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే( Rahul Hegde ) ఓ ప్రకటనలో తెలిపారు.పట్టణ,మండల శివారు ప్రాంతాలు,నిర్మానుష్య ప్రాంతాలపై నిఘా కట్టుదిట్టం చేశామన్నారు.
పాఠశాలల్లో మద్యం సేవించడం అత్యంత నేరం అన్నారు.
మద్యం త్రాగడం( Alcohol ), పార్టీలు నిర్వహించడం, జూదం లాంటి వాటిని కట్టడి చేస్తున్నామని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అలాంటి వారి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా జిల్లా కేంద్రం శివారులు, హైవే రహదారులు, గ్రామీణ రోడ్లు,దాబాలు, కల్వర్ట్స్,పాడుపడ్డ బంగ్లాలు,పాత బస్ షెల్టర్స్,పాఠశాల ప్రాంతాలు,నిర్మానుష్య ప్రాంతాలలో కొంత మంది మందుబాబులు మద్యం తాగుతున్నట్లు సమాచారం ఉందని, అలాంటి వారిని పట్టుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.