మూడోసారి మోడీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదం: చామల

సూర్యాపేట జిల్లా:దేశంలో మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాలిగౌరారంలో జన్మించిన ఈ ప్రాంత వాసిగా ప్రజల కష్టాలు తెలుసునని,మతోన్మాద శక్తులు మళ్ళీ అధికారంలోకి వస్తే మనం ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త శ్రమించి గెలుపు దిశగా కృషి చెయ్యాలని కోరారు.

 If Modi Comes To Power For The Third Time, The Constitution Will Be In Danger Ch-TeluguStop.com

అనంతరం మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ రాహూల్ గాంధీ ప్రధానమంత్రి ఐతే చామల కిరణ్ కుమార్ రెడ్డికి సముచిత స్థానం వుండబోతుందన్నారు.పోరాటాల స్ఫూర్తి గడ్డ తుంగతుర్తి అడ్డా అని,గెలిచిన తరువాత ఈ ప్రాంతంలో పార్టీ నమ్ముకున్న నాయకులని గుర్తుంచుకోవాలని సూచించారు.

నేను ప్రతిపక్ష నాయకునిగా ఈ ప్రాంతంలో వున్నానంటే కార్యకర్తలే నా ధైర్యమని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube