ప్లాట్ కబ్జా పైగా బెదిరింపుల దర్జా

సూర్యాపేట జిల్లా:తమ సొంత ప్లాట్ ను కబ్జా చేసిన అధికార పార్టీకి చెందిన నాయకుడిని ఇదేంటని అడిగినందుకు ఒక మహిళనని కూడా చూడకుండా అసభ్యంగా దూషిస్తూ,నీ దిక్కున్నచోట చెప్పుకో అంటూ బెదిరిస్తూ,ప్లాట్ కోసం వస్తే కాళ్ళు చేతులు నరికేస్తానని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని సోషల్ మీడియాలో ఓ మహిళ పెట్టిన వీడియో ఇప్పుడు జిల్లాలో వైరల్ గా మారింది.ఆ వీడియోలో ఆమె చెప్పిన మాటల ప్రకారం సూర్యాపేట జిల్లా మోతె మండలం రావిపహాడ్ గ్రామానికి చెందిన బి.

 Level Of Threats Over Plot Capture-TeluguStop.com

పద్మశ్రీ కుటుంబం గత కొంత కాలంగా పిల్లల చదువుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉంటున్నారు.వారికి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్ లో 10 గుంటల సొంత స్థలం ఉండగా,కుటుంబ అవసరాల నిమిత్తం గతంలో 5 గుంటలు విక్రయించారు.

ఆ 5 గుంటల్లో కూడా ఈ మధ్య కాలంలో మూడొంతుల స్థలం విక్రయించగా మిగిలిన 145 గజాల స్థలాన్ని పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఉంచుకుని దాని చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుకొని గుంటూరుకు వెళ్లిపోయారు.తమ ప్లాట్ ను జిల్లా కేంద్రానికి చెందిన అధికార పార్టీ నేత డా.భాయ్ మరికొందరు మంత్రి పేరు చెప్పుకుంటూ కబ్జా చేసి,ఆ స్థలంలో ఉన్న గోడను ధ్వంసం చేసి, మున్సిపాల్టీ నిధులతో రాత్రికిరాత్రే సిమెంట్ రోడ్డు పోయించారు.ఈ విషయం తెలుసుకున్న తాము సూర్యాపేటకు వచ్చి స్థానిక పోలీసులకు, మున్సిపాల్టీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ తమ గోడు పట్టించుకోవడం లేదని వాపోయింది.

వైశ్య కుటుంబానికి చెందిన తాము పిల్లల చదువుల కోసం గుంటూరులో ఉంటున్నామని, దాన్ని ఆసరాగా చేసుకొని సుమారు కోటి 50 లక్షల విలువగల తమ ప్లాటును దౌర్జన్యంగా అక్రమించారని, ఇదేంటని అడిగితే కాలనీలో కొందరు మహిళలను తమపైకి పురామయించి కొట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని,మళ్ళీ ప్లాట్ అంటూ గుంటూరు నుంచి సూర్యాపేటలో అడుగుపెడితే చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.గతంలో తమ స్థలంలో కరెంటు స్తంభాలు వేస్తే హైకోర్టును ఆశ్రయించి ఆ పోల్స్ ను తొలిగించేలా చేశామని, ఇప్పుడు డా.భాయ్ అతని అనుచరులు నుండి తమకు ప్రాణాహాని ఉందని,తమ ప్లాట్ కు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని,తమకు న్యాయం దొరకడం లేదని వాపోయింది.ఇప్పటికైనా జిల్లా మంత్రి,జిల్లా ఉన్నతాధికారులు,పోలీసు ఉన్నతాధికారులు స్పందించి స్థల పరిశీలన,సమగ్ర విచారణ జరిపి,తమ పరిస్థితిని అర్థం చేసుకొని తమ ప్లాటును తమకు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube