నకిరేకల్ లో బీఆర్ఎస్ నేతల మధ్య హోలీ రాజకీయం

నల్లగొండ జిల్లా:నకిరేకల్ నియోజకవర్గంలోఅధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యే మధ్య రాజకీయం రసవత్తరంగా మారుతుందని చెప్పడానికి హోలీ పండుగ కూడా వేదికగా మారింది.ఇరువురి నేతల మధ్య గత కొంత కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

 Holi Politics Among Brs Leaders In Nakirekal-TeluguStop.com

ఇదిలా ఉంటే హోలీ పండుగ సందర్భంగా నకిరేకల్ పట్టణంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయులు పోటా పోటీగా హోలీ సంబరాలకు సిద్ధమయ్యారు.కానీ,ఈ వేడుకలకు అనుమతులు ఇచ్చే విషయంలో స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర ఉద్రిక్తతలకు దారతీసింది.

మ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గానికి రెండు డీజేలు పెట్టుకోడానికి అనుమతులు ఇచ్చిన పోలీస్ శాఖ,మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గానికి డీజే అనుమతి లేదంటూ అడ్డుకోవడంతో హోలీ సంబరాల కార్యక్రమం వివాదంగా మారింది.

దీనితో పోలీసులు ఎమ్మెల్యేకుఅనుకూలంగా వ్యవహరిస్తూ తమను హోలీ సంబరాలు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని,ఎమ్మెల్యే మాటలు వినే తమకు డీజే అనుమతి ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయులు ఆందోళనకు దిగడంతో నకిరేకల్ పట్టణం హోలీ రాజకీయంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube