కె ఆర్ విజయ తన పెళ్లి విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచిందో తెలుసా?

అలానాటి మేటి నటీమణుల్లో ఒకరు కె ఆర్ విజయ.మహానటి సావిత్రి మాదిరిగానే బొద్దుగా ముద్దుగా ఉన్న విజయ.

 Why K R Vijay Hidden Her Marriage Issue, Kr Vijaya, Hidden, Marriage Issue, Preg-TeluguStop.com

ఆమెలాగే అద్భుతంగా నటించి టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.కె ఆర్ విజయ నిజానికి తెలుగు అమ్మాయి.

ఆమె అసలు పేరు దైవనాయకి.తండ్రి చిత్తూరుకు చెందిన వ్యక్తి రామచంద్ర.తల్లి కేరళ వాసి అయిన కల్యాణి.తన తండ్రి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ సైనికుడిగా పాల్గొన్నాడు.ఆర్మీలో ఉండగానే.తన మలయాళ స్నేహితుడి చెల్లిని పెళ్లి చేసుకున్నాడు.ఆయనకు ఆరుగురు సంతానం.అందులో ఐదుగురు అమ్మాయిలు కాగా, ఒక అబ్బాయి.

విజయకు చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే చాలా ఇష్టం.అందుకే పలు చోట్ల నాటక ప్రదర్శనలు ఇచ్చేది.

అలా డ్రామాలు వేస్తూ చెన్నైకి చేరుకుంది.అలా 1963లో తమిళ సినిమా కర్పగమ్ లో హీరోయిన్ గా అవకాశం వచ్చింది.

ఆ సినిమాకు కె ఎస్ గోపాల క్రిష్ణన్ దర్శకత్వం వహించాడు.అప్పుడే హీరోయిన్ పేరు మార్పుపై చర్చించారు.

అప్పుడు తన పేరును తల్లిదండ్రుల పేరు కలిసి వచ్చేలా కె ఆర్ విజయగా మార్చుకుంది.అనంతరం 1966లో తెలుగులో తొలి సినిమా చేసింది.

ఎన్టీఆర్ తో కలిసి శ్రీ‌కృష్ణ పాండ‌వీయంలో నటించింది.ఈ సినిమా చేసినప్పుడు విజయ వయసు కేవలం 17 సంవత్సరాలు.

Telugu Hidden, Vijaya, Kr Vijaya, Love, Married, Minor, Pregnant, Private Jet-Te

అదే ఏడాది త‌మిళ నిర్మాత‌, ఫైనాన్షియ‌ర్ సుద‌ర్శ‌న్ వేలాయుధ‌మ్‌ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఆయన ఫైనాన్స్ చేసిన ఓ తమిళ సినిమాలో విజయ నటించింది.అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది.ఆ తర్వాత నెమ్మదిగా ప్రేమ బలపడి పెళ్లి వరకు వెళ్లింది.అయితే తనను పెళ్లి చేసుకున్న విషయం విజయ చాలా కాలం బయటకు చెప్పలేదు.ఎందుకంటే తనకు పెళ్లి అయినప్పుడు ఆమె మేజర్ కాదు.

Telugu Hidden, Vijaya, Kr Vijaya, Love, Married, Minor, Pregnant, Private Jet-Te

ఆమె గర్భినిగా ఉన్నప్పుడు వేలాయుధమ్ ఫ్లైట్ లో పర్యటనకు తీసుకెళ్లాడు.అప్పుడు వీరిద్దరిని కలిపి ఓ వ్యక్తి ఫోటోలు తీశాడు.ఈ ఫోటోలు మరుసటి రోజు ఆయా పత్రికల్లో వచ్చాయి.అప్పుడు వీరి పెళ్లి విషయం బయటకు వచ్చింది.అప్పటికే వేలాయుధమ్ కు సొంత జెట్ విమానం ఉండేది.దేశంలో తొలి ప్రైవేట్ జెట్ ఉన్న నటిగా విజయకు పేరొచ్చింది.

అటు పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించేలా తన భర్త ఆమెను ప్రోత్సహించాడు.తన కెరీర్ లో ఎక్కువగా దేవత పాత్రలు చేసింది విజయ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube