ఎంతో ఘనంగా ఉత్సవ విగ్రహాల శోభాయాత్ర..

సాధారణంగా మన దేశంలో ఏ ప్రాంతంలో చూసినా బ్రహ్మోత్సవాలు, గ్రామ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి.ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు దేశ నలమూలాల నుంచి వచ్చి ఈ పుణ్య కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు.

 Sitarama Chandra Swamy Shobayatra In Chinna Gottimukkala Village Details, Sitara-TeluguStop.com

అలాగే మండలంలోని చిన్న గొట్టిముక్ల గ్రామం లో సోమవారం రోజు సాయంత్రం సీతారామ చంద్ర స్వామి ఉత్సవ విగ్రహాల తో పాటు యాత్రల శోభాయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు.అంతే కాకుండా దాత దశరథ్‌ రెడ్డి చాకలి మెట్ల సహకార ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద నూతనంగా నిర్మించిన సీతా రామ చంద్రస్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలకు అంకురార్పణ మొదలు పెట్టారు.

Telugu Anjaneyaswamy, Bakti, Devotional, Sitaramachandra-Latest News - Telugu

వేద పండితుడు శాస్త్రుల వామన శర్మ చాకరి మెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఇంకా చెప్పాలంటే గ్రామంలో స్వామి వారి యంత్రాలను పల్లకి ఊరేగింపులో మహిళలు, యువతులు కోలాటం ఆడారు.ఇంకా చెప్పాలంటే శోభాయాత్ర లో సీఎంఓ కార్యాలయ ప్రధాన కార్యదర్శి సింగాయి పల్లి నర్సింగ రావు దంపతులు కూడా పాల్గొన్నారు.

Telugu Anjaneyaswamy, Bakti, Devotional, Sitaramachandra-Latest News - Telugu

ఈ సందర్భంగా నర్సింగ రావు పల్లకి మోసారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు సింగాయి పల్లి గోపి, సర్పంచ్ బాలామణి, ఎంపిటిసి దశరథ్, గ్రామస్తులు నారాయణరావు, వెంకట రావు, నర్సింగరావు, హర్జనాయక్‌, బిక్షపతి రావు, కిషన్ రావు, యాదగిరి రావు, పాపయ్య చారి, వీర స్వామి, హనుమంత రావు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తదితరులు కూడా ఈ పుణ్య కార్యక్రమములో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవాలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube