భూమి పై జీవిస్తున్న ప్రతి వ్యక్తి కి వారు చేసే పనులలో ఎప్పుడో ఒకసారి ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి.కానీ చాలా మంది ప్రజలకు వారు ఏ పని మొదలుపెట్టిన అందులో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
సాధారణంగా మనిషికి నరదిష్టి( Evil Eye ) ఉండడమే దీనికు కారణమని పండితులు చెబుతున్నారు.దీని ప్రభావం మనిషి పై ఎప్పుడూ ఉంటుంది.
కానీ ఒక్కొక్కసారి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అలాగే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ( Negative Energy ) వస్తుందంటే కనిపించే సంకేతాల గురించి ఎవరికీ తెలియదు.ఇవి మీకు కనబడితే దరిద్రం రాబోతుందని అర్థం చేసుకోవచ్చు.ఆ సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో చీటికిమాటికి గొడవలు( Conflicts ) జరుగుతుంటాయి.ఆ గొడవలు ఎందుకు జరుగుతాయో కూడా అసలు అర్థం కాదు.
అలాగే ఏ వస్తువు పట్టుకున్న జారిపోతూనే ఉంటుంది.ముఖ్యంగా గాజు వస్తువులు ఎక్కువగా పగిలిపోతు ఉంటాయి.
ఏ పని మొదలుపెట్టిన అది ముందుకు సాగదు.అలాగే మీ స్నేహితులు మీపై లేనిపోని మాటలు చెప్పి వారు మీరు గొడవలు పడే వరకు వెళ్తుంది.
అలాగే ప్రతి దానికి కారణం లేకుండా పక్కవారితో వాదిస్తూ ఉంటారు.కాసేపు ఒంటరిగా గడుపుదామని ప్లాన్ చేసుకుంటారు.కానీ ఎక్కడికి వెళ్ళలేకపోతుంటారు.మీ ప్రయాణం మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది.ఇలా మీరు చేసే ప్రతి పనిలో ఏదో ఒక ఆటంకం ఎదురవుతూ ఉంటుంది.ఈ దరిద్రం నుంచి వెంటనే బయటపడాలంటే ఇల్లు శుభ్రం చేసుకోవాలి.
అలాగే పాత వస్తువులను దానం చేయాలి.ఇంట్లో ఆకుపచ్చని మొక్కలు పెంచుకోవాలి.
దీని వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ దూరమై, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.వీటిని పాటిస్తే నెగటివ్ ఎనర్జీ తో పాటు దరిద్రం కూడా మీ ఇంటి దరిదాపుల్లో కూడా ఉండదు.