తుదిదశకు జిల్లా పోలీస్ నూతన కార్యాలయ నిర్మాణం

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో శరవేగంగా నిర్మాణం జరుగుతున్న నూతన పోలీసు కార్యాలయ భవనం తుదిదశకు చేరుకుంది.ఈ సందర్భంగా నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ ఎస్.

 Construction Of The New Office Of The District Police Is Nearing Completion-TeluguStop.com

రాజేంద్రప్రసాద్ సోమవారం తనిఖీ చేశారు.కార్యాలయ పనులు వేగంగా చేయాలని,నాణ్యతతో కూడిన పనులు చేయాలని సంబంధిత కాంట్రాక్ట్ సంస్థను,హౌసింగ్ బోర్డు అధికారులను కోరారు.

ఎస్పీ వెంట పోలీస్ హౌసింగ్ ఎస్ఈ,ఏఈ తదితరులు ఉన్నారు.

*సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి:పోలీసు గ్రీవెన్స్ డే లో ఎస్పీ*

ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీసు కార్యాలయం నందు పోలీసు గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.నేటి పోలీసు గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లా నలుమూలాల నుండి 9 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక పర్యవేక్షణలో సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ కృషి చేస్తుందన్నారు.

ప్రతి ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.ప్రజలు సమస్యలను సామరస్యంగా, చట్టపరంగా పరిష్కరించుకోవాలని,భౌతిక దాడులు చేసుకుని కేసుల్లో చిక్కుకోవద్దు సూచించారు.

చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడితే చట్టపరమైన శిక్షలు తప్పవని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube