సూర్యాపేట జిల్లా:వి.వి.
ఫ్యాట్స్ లో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెక్టార్ అధికారులకు ఈవీఎం వివిఫ్యాట్( EVM ) లలో అభ్యర్థుల ఫోటోలు,కేటాయించిన గుర్తుల పొందుపరచడం విది విధానాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ సి.హెచ్.ప్రియాంక( Additional Collector C H Priyanka ) తో కలసి ఆయన పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల( Election ) నేపథ్యంలో నియమించిన సెక్టార్ అధికారులు,మాస్టర్ ట్రైనర్స్ కు అభ్యర్థుల ఫోటోలు,గుర్తులను పొందుపరచడంపై రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్స్ రమేష్,వెంకటేశ్వర్లతో శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
జిల్లాలో ఉన్న మొత్తం పోలింగ్ కేంద్రాలలో 5 శాతం ఈవీఎంలలో వెయ్యి ఓట్ల చొప్పున తప్పక పరిశీలన చేయాలని సూచించారు.
ఫోటోలు,గుర్తుల లోడింగ్ ప్రక్రియ ఆర్ఓల ఆధ్వర్యంలో జరగాలని, దానికి సంబంధించి బెల్, ఈసిఐఎల్ కంపెనీ ఇంజనీర్లు గుర్తులను అప్ లోడ్ చేయడం జరుగుతుందని,తదుపరి ఈవీఎంలను సీలింగ్ చేసిన అనంతరం అందరి సమక్షంలో ఈవీఎంలపై సంతకాలు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈవీఎం కమిషినింగ్ పరిశీలించటానికి పార్టీ అభ్యర్థులు,ఏజెంట్లను ఆయా నియోజకవర్గాలలో అనుమతి కల్పిస్తామని కలెక్టర్( S Venkat rao ) తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి సాంబిరెడ్డి, ఎస్ఎల్ఎంటిఎస్ రమేష్, వెంకటేశ్వర్లు,సెక్టార్ అధికారులు, ఏఎల్ఎంటిఎస్,ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.