సూర్యాపేట జిల్లా: జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం 10:30 గంటల సమయంలో మన ఇసుక వాహనం పథకంలో నడుస్తున్న కొత్తగూడెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ ఓవర్ స్పీడ్ తో వెళుతూ బోల్తా పడింది.ఈ ఘటనలో ఓ బాటసారి తలకు తీవ్రంగా గాయలైనట్టు తెలుస్తోంది.
ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం,అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు.రెవిన్యూ,పోలీస్ అధికారులు స్పందించి ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని,ఇప్పటికైనా ఇసుక ట్రాక్టర్ల వేగాన్ని నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.