సూర్యాపేట జిల్లా: మునగాల మండల కేంద్రంలోని నారాయణగూడెం రోడ్డులో గల ప్రభుత్వ భవనాన్ని గతంలో వెలుగు ఆఫీస్ కోసం కేటాయించారు.వెలుగు ఆఫీస్ ను నూతన భవనంలోకి మార్చడంతో పాత భవనం ఖాళీచేశారు.
దీనికి దగ్గరలో వైన్స్ షాపు ఉండడంతో మందుబాబులకు,అసాంఘిక కార్యకలాపాలకు ఇది అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి ఈ భవనంలో యువకులకు ఓపెన్ జిమ్ లేదా ప్రైవేట్ బిల్డింగ్ లో నడుస్తున్న సిఐ కార్యాలయాన్ని ఇందులోకి మార్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
బిల్డింగ్ వెంటనే స్వాధీనం చేసుకోవాలని సామాజిక కార్యకర్త గంధం సైదులు అన్నారు.గతంలో వెలుగు ఆఫీస్ కు కేటాయించిన భవనం నేడు ఖాళీగా ఉండడంతో మందు బాబులకు అడ్డాగా మారి, ఈ దారి వెంట వెళ్ళే వారికి ఇబ్బందిగా మారిందని, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చొరవ తీసుకొని వృథాగా ఉన్న ప్రభుత్వ భవనాన్ని వినియోగంలోకి తెస్తే ప్రజలకు ఉపయోగపడే ఆకాశం ఉందన్నారు.