మైహోమ్ సిమెంట్ లో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు దుర్మరణం

మేళ్లచెరువు మండల పరిధిలోని మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ( My Home Cement Factory )లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది.మై హోమ్ యాజమాన్యం అనుమతి లేకుండా నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్ లో 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి కిందపడిన ఘటనలో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందగా,పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

 Telangana Cement Factory Accident Six Migrant Workers Died,telangana Cement Fact-TeluguStop.com

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని,వీరంతా ఉత్తరప్రదేశ్,బీహార్ రాష్ట్రాలకు చెందిన వారని సమాచారం.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.

కానీ, ప్రమాదంపై మైహోమ్ యాజమాన్యం గోప్యత పాటిస్తూ,మీడియాను అనుమతించకుండా ఆంక్షలు విధించింది.గతంలోనే మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో అక్రమ నిర్మాణాలు( Illegal Constructions ) జరుగుతున్నాయని మీడియా కోడై కూసినా తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

అప్పడే అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు ఇంత ప్రాణాలు కోల్పోయేవారు కాదని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube