మున్సిపల్ అక్రమాలపై కలెక్టర్ కి ఫిర్యాదు

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మరియు అదనపు కలెక్టర్లను 23 వ,వార్డు కౌన్సిలర్ జక్కుల వీరయ్య,3వ,వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్దండ వీరారెడ్డిలు కలిసి, మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి,ఆక్రమణలు, అధికార దుర్వినియోగానికి సంబంధించి వినతిపత్రం సమర్పించారు.

 Complaint To The Collector On Municipal Irregularities-TeluguStop.com

మున్సిపాలిటీలో జరుగుతున్న వారికి క్లుప్తంగా వివరించారు.అనంతరం వారు మాట్లాడుతూ హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన భర్త గెల్లి రవి తన భార్య అధికారాన్ని అడ్డం పెట్టుకొని మున్సిపల్ లే అవుట్ స్థలాలను ఆక్రమించడమే కాకుండా వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు దొంగతనం చేసిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

అంతేకాకుండా చెయ్యని పనులకి ఎంబీలు చేయించి లక్షల్లో బిల్లులు డ్రా చేయడమే కాకుండా,మున్సిపల్ అధికారులైన ఆర్ఐ, మరియు ఏఈ విధులకు ఆటంకం కలిగిస్తూ వారిని బెదిరించి వారి యొక్క లాగిన్ పాస్వర్డ్ లను తీసుకొని తన ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ నేనే రాజు నేనే మంత్రిగా వ్యవహరిస్తున్నారని తెలిపామన్నారు.కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఖాళీ ఆస్తులకు నాలా లేకుండా,లేఅవుట్ లేకుండా ఇంటి నెంబర్లు కేటాయిస్తూ అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడి,ఏకంగా మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి తన బినామీ వీర్లపాటి భాస్కర్ పేరు మీద రిజిస్ట్రేషన్ కి యత్నించారని తెలియజేశామన్నారు.

ఈ విధంగా మున్సిపాల్టీకి ఏ సంబంధం లేని వ్యక్తి చైర్మన్ సీట్లో కూర్చొని ఇన్ని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని గతంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఏ విధమైన చర్యలు లేవని చెప్పామన్నారు.కావునా తాము చేస్తున్న ఫిర్యాదులపై సమగ్రమైన విచారణ జరిపి,మున్సిపాలిటీలో జరిగే అవినీతి,అక్రమాలకు కారణమైన మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనను పదవి నుండి వెంటనే తొలగించాలని,చైర్ పర్సన్ భర్త గెల్లి రవి మరియు వీర్లపాటి భాస్కర్ లను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube