రాకేష్ హత్యకు ఆ ఇద్దరే బాధ్యత వహించాలి.ఇద్దరినీ గద్దె దించితేనే దేశానికి,రాష్ట్రానికి మేలు జరుగుతుంది.
-డీసీసీ అధ్యక్షుడు వెంకన్న యాదవ్.
సూర్యాపేట జిల్లా:అగ్నిపథ్ ను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని,రాకేశ్ హత్యకు ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారని ధ్వజమెత్తారు.కేసీఆర్ లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి విద్యార్థులను మభ్యపెడుతూ నిరుద్యోగ తెలంగాణగా మార్చారని అన్నారు.
తెలంగాణ ప్రజలే కేసీఆర్ ను తరిమి కొడతారని అన్నారు.లాఠీ చార్జీలు,టియర్ గ్యాసులు, కాల్పులతో యువత మరణాలకు,గాయాలకు కారణమై,యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న మోడీ పెద్ద కేడీ అని వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో దేశంలో,రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని,కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురు తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా మోడీ,కేసీఆర్ లు బుద్ధి మార్చుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ పట్టణ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.