యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కల్తీ బియ్యం కొనుగోలు చేసి మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.గత మూడు రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు కారులో బియ్యం బ్యాగులతో వచ్చి పొలంలో పండించిన కర్నూలు బియ్యం మార్కెట్ ధర రూ.1500 ఉంటే మేము రూ.1100 లకే ఇస్తున్నాం, కావాలంటే చూసుకొని నచ్చితేనే తీసుకోండని కాలనీలో మహిళలను నమ్మించారు.పైన కర్నూలు బిపిటి సన్న బియ్యం,కింద మొత్తం కంట్రోల్ బియ్యం బ్యాగులను అంటగట్టి అక్కడి నుండి పరారయ్యారు.
తీరా బియ్యం బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా మొత్తం మొత్తం లక్క పురుగులు,దుమ్ము ధూళితో రేషన్ బియ్యం ఉండడంతో మహిళలకు ఖంగుతిన్నారు.కొందరు కేటుగాళ్లు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని, ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే పట్టుకొని పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.