ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెంటనే అమలుపరచాలి:యాతాకుల రాజన్న మాదిగ

సూర్యాపేట జిల్లాSuryapet District): ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రంలోని పూర్వ విద్యార్థుల భవనంలో ఎమ్మార్పీఎస్ ,ఎమ్మెస్పీ(MMRPS, MMP) మరియు అనుబంధ సంఘాల నూతన పునర్నిర్మాణ కమిటీ ఎన్నిక సమావేశం శనివారం నియోజకవర్గ ఇన్చార్జి ములకలపల్లి రవి మాదిగ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశ ముఖ్య అతిథిలుగా ఎమ్మార్పీఎస్,ఎమ్మెస్పీ జిల్లా కోఆర్డినేటర్స్ యాతాకుల రాజన్న మాదిగ,చింత వినయ్ బాబు మాదిగలు హాజరై మాట్లాడుతూ మహా జననేత,మానవతా ఉద్యమాల పితామహుడు మంద కృష్ణ మాదిగ నేతృత్వంలోఎమ్మార్పీఎస్ ఉద్యమం ఏర్పడిన తర్వాతనే మాదిగ జాతికి ఆత్మగౌరవం,గుర్తింపు వచ్చిందన్నారు.

 Supreme Court Verdict On Sc Classification Should Be Implemented Immediately: Ya-TeluguStop.com

ఎస్సీ వర్గీకరణ కోసం మొదలైన ఎమ్మార్పీఎస్ ఉద్యమం లక్ష్యసాధన కోసం ఏకంగా భారత ప్రధానమంత్రిని కూడా కదిలించిన చరిత్ర ఉందన్నారు.ఎమ్మార్పీఎస్ డిమాండ్ అయిన ఎస్సీ వర్గీకరణలో ఉన్న న్యాయబద్ధతను గుర్తించిన సుప్రీంకోర్టు ఆగష్టు 1వ,తేదీన ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని చారిత్రాత్మక తీర్పును ఇచ్చిందన్నారు.

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలులోకి తీసుకురావాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగ జాతికి అన్యాయం చేస్తున్నాడని విమర్శించారు.నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకువచ్చే మొదటి రాష్ట్రంగా తెలంగాణను నిలబెడుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆ హామీని విస్మరించి మాదిగ జాతికి నమ్మిక ద్రోహం చేశాడని ఆరోపించారు.

అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు 11062 టిచర్ పోస్టులను భర్తీ చేసి మాదిగలకు ముఖ్యమంత్రి అన్యాయం చేశాడన్నారు.కనుక ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాదిగ బిడ్డలు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కోఆర్డినేటర్ ఎర్ర వీరస్వామి,కనుకుంట్ల వెంకన్న,కోడి వెంకటయ్య, బత్తుల వెంకట రాములు, మేడి కృష్ణా,తిప్పర్తి గంగరాజు,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube