సూర్యాపేట జిల్లా:రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు.సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిఎం కేసీఆర్ నిరాశ నిస్పృహలతో వున్నారని,టిఆర్ఎస్ ఓటమి అంచున వున్నదని పలు సర్వేలలో తెలియడంతో కేసీఆర్ ఆత్మరక్షణలో పడిపోయారని అన్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కెసిఆర్,బీజేపీలు ఒకరిపై ఒకరు నిందలు మోపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.కేసీఆర్,మంత్రుల ఢిల్లీ పర్యటనలతో ఒరిగేది ఏమి లేదని కొట్టిపారేశారు.
రాష్ట్రంలో పాలనను గాలికొదిలేశారని విమర్శించారు.జిల్లాలో ధాన్యం కొనుగోలులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో పిసిసి అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు,పట్టణ అధ్యక్షుడు అంజద్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.