సూర్యాపేట జిల్లా: సమాజంలో దీనులు, హీనులు,అభాగ్యులు, వితంతువులు,అనాధలతో ప్రతి ముస్లిం ప్రేమగా, ఆప్యాయంగా ప్రవర్తించాలని జాతీయ ముస్లిం పర్సనల్ లా బోర్డు మెంబర్,మెహర్బా ఫౌండేషన్ జాతీయ వ్యవస్థాపకులు మౌలానా గయాసుద్దీన్ రష్ది అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని ఉస్మానియా మస్జిద్ నందు నిర్వహించిన ముస్లిం మైనారిటీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాలామంది
ముస్లింలకు, యువకులకు,మహిళలకు ఇస్లాం మరియు ఖురాన్ బోధనల జీవిత సారాంశం గురించి పూర్తిగా తెలియకపోవటం,అవగాహన లేకపోవడం వలన వారు సన్మార్గంలో పోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మొబైల్ ఫోన్లు అతి వాడకం అనేక అనర్ధాలకు దారితీస్తుందని,మానవుని పుట్టుక నుంచి చనిపోయేంతవరకు ఎలా జీవించాలో,సమాజంలో ఎలా నడుచుకోవాలో క్షుణ్ణంగా వివరించారు.అనంతరం ప్రపంచ శాంతి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.