జానీ మాస్టర్ కు కౌంటర్ ఇచ్చిన శ్రేష్ట వర్మ.. ఆ కామెంట్లపై క్లారిటీ వచ్చేసిందిగా!

టాలీవుడ్ ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్( Jani Master ) ఇటీవల ఒక లైంగిక వేధింపుల కేసులో భాగంగా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.కొద్దిరోజుల పాటు జైలు జీవితం కూడా గడిపాడు జానీ మాస్టర్.

 Shrasti Verma Counters To Jani Master Details, Shrasti Verma, Jani Master, Tolly-TeluguStop.com

అయితే చాలా ప్రయత్నాల తర్వాత అతడికి బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.బెయిల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తొలిసారి భార్యతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

భార్యతో కలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.దేవుడున్నాడని చెప్పుకొచ్చాడు.

ఇప్పుడా ఇంటర్వ్యూకు కౌంటర్ వచ్చింది.ఎవరి కారణంగా జానీ మాస్టర్ జైలు కెళ్లాడో, ఆ అమ్మాయి తెరపైకి వచ్చింది.

ఎప్పుడెప్పుడా అని అభిమానులు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న డాన్సర్ శ్రష్టి వర్మ( Shrasti Verma ) తాజాగా మీడియా ముందుకు వచ్చింది.ఈ సందర్భంగా శ్రష్టి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.

Telugu Allu Arjun, Jani Master, Pushpa, Shrasti Verma, Shrastiverma, Tollywood-M

జానీ మాస్టర్ పై నేను చేసింది కక్షతో కాదు, అది నా అత్మగౌరవానికి సంబంధించిన విషయం.ఒక అమ్మాయిని శారీరకంగా, మానసికంగా వాడుకొని, ఆ తర్వాత మరో అమ్మాయిని పెట్టుకుంటే ఓకేనా.అప్పుడు నేను చర్యలు తీసుకోకూడదా.అది రివెంజ్ ఎలా అవుతుంది.అది నా సెల్ఫ్ రెస్పెక్ట్. కేసు పెట్టే ముందు తనవద్ద రెండే ఆప్షన్లు ఉన్నాయి.

ధైర్యంగా ముందుకెళ్లడం లేదా ఆత్మహత్య చేసుకోవడం మాత్రమే.వాటిలో నేను మొదటి దాన్ని ఎంచుకును అని తెలిపింది శ్రష్టి.పుష్ప2( Pushpa 2 ) సెట్స్ లో జానీ మాస్టర్ తనతో గొడవ పెట్టిన అంశంపై స్పందించడానికి నిరాకరించింది.పుష్ప2 సెట్స్ లో ఉన్నప్పుడు జానీ మాస్టర్ వచ్చి గొడవ చేశాడు.చేయి చేసుకున్నాడు.కొంతమంది డాన్సర్లు కూడా అక్కడ అది చూశారని చాలామంది అంటున్నారు.దానిపై నాక్కూడా స్పందించాలని ఉంది.కానీ కేసు కోర్టు పరిధిలో ఉంది.

Telugu Allu Arjun, Jani Master, Pushpa, Shrasti Verma, Shrastiverma, Tollywood-M

కోర్టులోనే చెబుతాను అని తెలిపింది శ్రష్టి.తన వెనక వైసీపీ పార్టీ( YCP ) లేదా అల్లు అర్జున్( Allu Arjun ) ఎవ్వరూ లేరని, తను ఒంటరిగా పోరాటం చేస్తున్నానని తెలిపింది శ్రష్టి.తన ఆత్మ గౌరవం కోసం తాను పోరాటం చేస్తున్నానని, తనకు ఎవ్వరి మద్దతు అవసరం లేదని తెలిపింది.వ్యక్తిగత వివాదానికి జాతీయ అవార్డుకు సంబంధం ఏంటని కొందరు నన్ను అడుగుతున్నారు.

ప్రొఫెషనల్ గా ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ, గుణం కూడా ముఖ్యం కదా.నేషనల్ అవార్డ్స్ కు ఒక చరిత్ర ఉంది.అలాంటి అవార్డ్ ను గుణం లేని ఒక మనిషికి ఎలా ఇస్తారు అని ఆమె ప్రశ్నించింది.అలాగే నన్ను జానీ మాస్టర్ పరిశ్రమలోకి తీసుకురాలేదని అంటోంది.రియాలిటీ షోలో టాలెంట్ చూపించి, నా స్వశక్తితో పరిశ్రమలోకి వచ్చాను, నన్ను జానీ మాస్టర్ తీసుకురాలేదు.ఇంకా చెప్పాలంటే ఆయన నాకు ఏమి చేయలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సృష్టి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube