ప్రస్తుత సమాజంలో చిన్న వయసు వారి దగ్గర నుంచి పెద్ద వయసు వారి వరకు చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.అలాంటి అనారోగ్య సమస్యలలో నడుము నొప్పి( Back pain ) ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని అనారోగ్యాల కారణంగా నడుము నొప్పి రావడానికి కొన్ని మనం చేసే చిన్న పొరపాట్లు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.అంతే కాకుండా నడుము నొప్పికి వయసు, ఎత్తు, బరువు, ఆడ, మగ ఇలాంటి సంబంధాలు అసలు ఉండవు.
అలాగే నడుము నొప్పి రావడానికి గల కారణాలను తెలుసుకుంటే నొప్పిని సులభంగా నివారించవచ్చు.

సరైన పద్ధతిలో కూర్చోకపోతే నడుము నొప్పి వచ్చే ప్రమాదం ఉంది.సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల కండరాలు, ఎముకల మీద ఒత్తిడి పెరిగి వెన్నునొప్పి ప్రారంభమవుతుంది.అంతే కాకుండా అధిక బరువు( Overweight ) కూడా నడుము నొప్పికి ఒక కారణం అని నిపుణులు చెబుతున్నారు.
దీని వల్ల ఎముకలు కీళ్ల మీద ఒత్తిడిని కలుగుతుంది.అలాగే బరువు పెరగకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి.ముఖ్యంగా చెప్పాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.దీని వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి.
అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం ( Exercise )చేయడం వల్ల కండరాల ఒత్తిడి దూరమవుతుంది.

అలాగే ఇది వెన్ను నొప్పిని నివారిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే కొందరు కొన్ని వస్తువులు బరువు మోసేటప్పుడు తప్పుగా ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.దాని వల్ల నడుము పై ఒత్తిడి పెరుగుతుంది.
ముఖ్యంగా బరువైన వాటిని ఎత్తేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అలాగే క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
ఇలా తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.దీని వల్ల నడుము నొప్పి ( Back pain )నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.