సూర్యాపేట జిల్లా:జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాట్లను పరిశీలించి,గణతంత్ర దినోత్సవ పరేడ్ ప్రాక్టీస్ ను పరిశీలించారు.సిబ్బందికి పలు సూచనలు చేశారు.
వేడుకలకు వచ్చే పౌరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ కమాండర్ గా ఆర్ఐ నారాయణరాజు వ్యవహరించనున్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు,జనార్ధన్ రెడ్డి, ఏఆర్ డిఎస్పీ నరసింహచారి, ఆర్ఐ నరసింహ,పరేడ్ సిబ్బంది పాల్గొన్నారు.