ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా పక్షాపాతి అని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.మాహిళా సాధికారతకు తెలంగాణా ప్రభుత్వం పెట్టింది పేరని ఆయన అభివర్ణించారు.
గడిచిన తొమ్మిదేళ్లుగా చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో మాహిళల సంక్షేమానికి, రక్షణకు ఘననియమైన సంస్కరణలు తీసుకొచ్చామన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణా నారీ లోకానికి శుభాకాంక్షలు తెలిపారు.
షి టీమ్స్,కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్,అమ్మవడి,కేసిఆర్ కిట్ లు ఇందుకు తార్కాణాలని ఉదహరించారు.ఇవి గాక విద్యా,ఉపాధి,ఉద్యోగ, రాజకీయ రంగాలలో మహిళలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని కొనియాడారు.హైదరాబాద్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కుడా మహిళను నిలబెట్టి గెలిపించుకున్న రికార్డ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు.తెలంగాణా లోని స్థానిక సంస్థలలో 50% మహిళలలకు రిజర్వేషన్లు వర్తింప చెయ్యడంతో పాటు నామినేటెడ్ పోస్టులలోను 50% మహిళలకు రిజర్వేషన్లు కలిపించి రాజకీయంగా మహిళలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వంగా చెప్పుకొచ్చారు.ప్రస్తుతం తెలంగాణా రాజకీయాలలో చట్టసభలతో పాటు నామినేటెడ్ పదవుల్లో ఉన్న మహిళల సంఖ్య 67,486 (50.07%)గా వెల్లడించారు.అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించి వారిని ఉన్నత శిఖరాలను అదోరోహించేలా చేస్తూ మహిళా పక్షపాతిగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళలు బాసటగా నిలబడ్డారని, భవిష్యత్ లోనూ అంతే అండగా ఉంటారని ఆకాంక్షించారు.







