సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండల కేంద్రం తుమ్మాయిగడ్డలో ఓజో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.దీనిపై స్పందించిన గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఆ సేవా కార్యక్రమాల్ని చూస్తూ ఓర్వలేని కొంతమంది వ్యక్తులు ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో రఘు లాంటి మంచి వ్యక్తులను హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా స్వాగతం పలుకుతారని అన్నారు.