బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి ఉద్ఘాటన.( Modepalli Krishnamachari ) సూర్యాపేట జిల్లా: రాజ్యాధికారం కోసం బీసీలు ఐక్యంగా ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి, బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు.సోమవారం అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం జనరల్ బాడీ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.బీసీలు ఇంకెంతకాలం పల్లకి మోసే బోయిలుగానే మిగులిపోతారని,దేశంలో 92 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాలు ఐక్యత సాధిస్తే కేవలం 8 శాతం ఉన్న వర్గాలు అధికారానికి దూరం అవుతాయన్నారు.
అట్టడుగు వర్గాలే అధికారాన్ని అధిరోహించాలన్న అంబేద్కర్ కన్న కలలు నిజం కావాలంటే ఇప్పటికైనా బీసీలు కళ్ళు తెరిచి పోరాట బాట పట్టాలని,పార్లమెంట్లో రాజకీయ రిజర్వేషన్ సాధించేంతవరకు, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో( General election ) ఎస్సీ,ఎస్టీ,బీసీ, వర్గాలకు మాత్రమే ఓట్లు వేసేంత చైతన్య వచ్చేవరకు,మడమ తిప్పని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం అనంతగిరి బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడిగా దొంగరి శ్రీనివాస్( Dongari Srinivas ), యువజన విభాగం అధ్యక్షుడిగా అంకతి రమేష్ ను నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు.
కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు ఇనుగుర్తి వెంకటరమణాచారి,బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బచ్చు రాజ్యం,నియోజకవర్గ అధ్యక్షురాలు మండవ నాగమణి,నిగిడాల వీరయ్య,యరసాని నాగమణి,లక్ష్మి,ఊదర వెంకన్న తదితరులు పాల్గొన్నారు.