సూర్యాపేట జిల్లా:జిల్లాలో మహిళా సాధికారత,వారి హక్కులను తప్పక అమలు చేయడం జరుగుతుందని పి.డి.
ఐసీడీయస్ జ్యోతిపద్మ అన్నారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా చేపట్టిన ఆటల పోటీల బహుమతుల బహుకరణ కార్యక్రమంలో ఏ.ఓ శ్రీదేవి,బిసి వెల్ఫేర్ అధికారిని అనసూర్యలతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సృష్ఠికి మూలం స్త్రీయని సమాజంలో ప్రతి స్త్రీకి అన్ని హక్కులు అందాలని అన్నారు.
పిల్లకు మంచి విలువలతో కూడిన విద్యను అందించాలని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు అన్ని రంగాలలో రాణించుటకు ఎంతో కృషి చేస్తున్నాయని అన్నారు.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహిళల్లో ఉన్నతమైన స్థానాలలో ఉన్నారని,వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.
అనంతరం వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన మహిళ ఉద్యోగులకు బహుమతులు అందచేసారు.ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ని జిల్లా మహిళ ఉద్యోగులు అభినందించారు.
అనంతరం బాల భవన్ బాలలచే నృత్య ప్రదర్శనలతో పాటు మహిళ ఉద్యోగులు హక్కులు,సాధికారతపై ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షలు యస్.కె జనిమియా,కార్యదర్శి దున్న శ్యామ్,వివిధ శాఖల అధికారులు,సంఘ నాయకులు ఆకాష్ వర్మ, సైదులు తదితరులు పాల్గొన్నారు.