తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తి అంబేద్కర్ రాజ్యాంగం

సూర్యాపేట జిల్లా:యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు డాక్టర్ బి.ఆర్.

 Ambedkar Constitution Was The Inspiration For Telangana Statehood-TeluguStop.com

అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే స్ఫూర్తిగా నిలిచిందని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాల మహానాడు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తలమల్ల హసేన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించి కార్యక్రమానికి ఆయన హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే ఘనంగా నివాళులు అర్పించి,ప్రజల ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు.

రాజ్యాంగ స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.చరిత్రలో ఎవరు ప్రవేశపెట్టని,ఏ దేశంలో అమలు చేయని సంక్షేమ పథకాలను మన ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు.

నూతనంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సచివాలయానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేశారని,దేశంలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పార్లమెంటు భవనం అని నామకరణం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినారని గుర్తు చేశారు.దళితుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తుందన్నారు.

అంబేద్కర్ స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దళిత,గిరిజన,బడుగు బలహీన, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి బాటలు పడుతున్నాయన్నారు.స్వేచ్ఛ,సమానత్వం,సాబ్రాతృత్వం అందించే రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ,జిల్లా గ్రంధాల చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ, మాల మహానాడు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తల్లమల్ల హసేన్,నాయకులు తప్పెట్ల శ్రీరాములు,మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి దేవయ్య,కేవిపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి,బోల్లెద్దు వినయ్,అప్పం శ్రీనివాసరావు కౌన్సిలర్ జహీర్,సట్టు నాగయ్య,న్యాయవాదులు డి.మల్లయ్య,బి.వెంకటరత్నం ఏడిళ్ల అశోక్,బొల్లె జానయ్య, యాతాకుల సునీల్,నామ వేణు,గాజుల నరసయ్య,బోయిల అఖిల్,పంగరెక్క సంజయ్,ఎడ్ల కళ్యాణ్,కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube