నకిలీ రశీదులతో ఇంటి పన్ను వసూల్

సూర్యాపేట జిల్లా:అనంతగిరి మండలం ఖానాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నకిలీ రశీదులతో ఇంటి పన్నులు వసూలు చేయడం కలకలం రేపుతోంది.బిల్ కలెక్టర్ సంతకాన్ని గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ ఉద్యోగి ఫోర్జరీ చేసి గ్రామానికి చెందిన పలువురి నుంచి ఇంటి పన్ను వసూలు చేసినట్లు గ్రామస్థులు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

 Collection Of House Tax With Fake Receipts-TeluguStop.com

దీంతో అధికారులు విచారణ చేస్తున్నారు.ఖానాపురం గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ ఉద్యోగి సురేష్ ఇంటి పన్ను నకిలీ రశీదు బిల్లులతో ఆవాస గ్రామమైన అజ్మీర తండాలో పలువురి నుంచి ఇంటి పన్ను వసూలు చేసిననట్లు తెలుస్తోంది.

గ్రామంలో గతంలో రెగ్యులర్ బిల్ కలెక్టర్ ఇంటి పన్నులు వసూల్ చేసేవారు.అయితే ఇదే గ్రామానికి మల్టీపర్పస్ ఉద్యోగి సురేష్,బిల్ కలెక్టర్ మంగమ్మ సంతకాన్ని పోర్టరీ చేసి నకిలీ రశీదు బిల్లులతో గ్రామంలో పలువురి నుంచి ఇంటి పనులు వసూలు చేసి,ఆ నగదును గ్రామ పంచాయతీ అకౌంట్లో జమ చేయకుండా దుర్వినియోగం పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

గ్రామానికి చెందిన ఓ ఇంటి యజమాని గతంలో ఇంటి పన్ను చెల్లించినా,రికార్డుల్లో ఇంటి పన్ను బకాయి ఉండటాన్ని గుర్తించి మల్టీపర్పస్ ఉద్యోగిని నిలదీయగా ఈ తతంగం వెలుగులోకి వచ్చింది.మల్టీపర్పస్ ఉద్యోగి గ్రామంలో నకిలీ ఇంటి పన్ను రశీదులు ఇవ్వడాన్ని రెగ్యులర్ బిల్ కలెక్టర్ కూడా గుర్తించారు.

దీంతో గ్రామంలో ఎంతమందికి మల్టీపర్పస్ ఉద్యోగి నకిలీ బిల్లులు ఇచ్చి మోసం చేశాడోనని ఆజ్మిర తండావాసులు అందోళన చెందుతున్నారు.గ్రామంలో అక్రమంగా ఇంటి పన్ను వసూలు చేసిన ఉదంతంలో ఒక్క మల్టీపర్సస్ ఉద్యోగితో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్ పాత్ర ఉందని ఆ గ్రామస్ధులు ఆరోపిస్తున్నారు.

ఇంటి పన్ను నిధులు దుర్వియోగంపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయించి నిందితులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఖానాపురం గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి జనవరి నెలలో బిల్ నెం.500 నుంచి ఇంటి పన్ను రశీదులు ఇచ్చారు.ప్రస్తుతం ఈ సీరియల్ 600 లో నడుస్తోంది.ఈ ఏడాది అక్టోబరు నెలలో రశీదు నెం.176 మా కార్యాలయం నుంచి ఇవ్వలేదు.ఖానాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో మల్టీపర్పస్ ఉద్యోగి కొన్ని రోజులుగా అక్రమంగా ఇంటి పన్ను వసూలు చేస్తున్నాడు.సంబంధిత అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.డిపిఓ యాదయ్యను వివరణ కోరగా ఖానాపురంలో నకిలీ బిల్లులతో ఇంటి పన్ను వసూలు చేసిన విషయం నా దృష్టికి రాలేదు.ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube