సూర్యాపేట జిల్లా: బహుజన గౌడ బిడ్డ,తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేసేందుకు కుట్రపన్నిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి కుట్రకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జై గౌడ ఉద్యమ సంఘం జిల్లా అధ్యక్షులు గోపగాని రవికుమార్ గౌడ్ అన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో,ఈ కుట్రకు సంబంధించిన వారిని,వారికి సుపారీ ఇచ్చిన జితేందర్ రెడ్డి,డీకే అరుణపై కేసు నమోదు చేయాలని కోరుతూ సూర్యాపేట సీఐ ఆంజనేయులుకు గురువారం పిటిషన్ అందజేశారు.అనంతరం గోపగాని రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ గౌడ్ ను,ఆయన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక హత్యకు కుట్ర పన్నారని తెలిపారు.
బహుజన గౌడ బిడ్డ జోలికి వస్తే ఈ రాష్ట్రంలో గౌడ్ ల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమ నియోజకవర్గ అధ్యక్షలు నక్క రమేష్ గౌడ్,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చామకూరి మహేందర్ గౌడ్,జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షులు బంటు సందీప్ గౌడ్,పెద్ద వెంకన్న గౌడ్,నవీన్ గౌడ్,బాబు గౌడ్,పవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.