సూర్యాపేట జిల్లా:బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులో నూతనంగా నిర్మించిన హెచ్ డి ఎఫ్ సీ బ్యాంకును తెలంగాణ హెచ్ డీ ఏఫ్ సీ సర్కిల్ హెడ్ పవన్ కూమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు వారి అవసరాల నిమిత్తం బ్యాంకుకు వస్తారని తదనుగుణంగా వారికి నాణ్యమైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు.బ్యాంకులు ప్రజాశ్రేయస్సు కోరకు పని చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ ప్రవీణ్ కుమార్, శరత్ బాబు,పాపరాజు,బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.