యాదాద్రి భువనగిరి జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పేద విద్యార్థుల కడుపు నింపడం లేదని ఎస్ఎఫ్ఐ ఆలేరు మండల కార్యదర్శి కాసుల నరేష్ ( Secretary Kasula Naresh )అన్నారు.గురువారం ఆలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే కార్యక్రమంలో ఆయన పాల్గొని పాఠశాలలోని వసతులు, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఎస్ఎఫ్ఐ( SFI ) నాయకుల దృష్టికి అనేక సమస్యలు తీసుకొచ్చారు.అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో అధిక శాతం మంది పిల్లలు నాసికమైన భోజనం పెడుతున్నారని,ఏమాత్రం రుచి ఉండదని, చాలామంది విద్యార్థులు ఇంటి నుండి టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటున్నామని తెలిపారని అన్నారు.
నాసిరకంగా భోజనం పెట్టడం వల్ల ఆలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిరుపయోగంగా మారిపోయిందన్నారు.ఎస్ఎఫ్ఐ కమిటీ బృందం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
భోజనం ముద్దలుగా మారిపోవడం వల్ల ఏ మాత్రం రుచి లేని కూరగాయల వలన తాము కూడా తినలేక పోయామని,ఇక విద్యార్థులు ఎలా తింటారని వాపోయారు.పాఠశాలలో మౌలిక వసతులు కల్పనలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుందని,విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా మూత్రశాలలు లేకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు ఉన్నప్పటికీ స్కూలుకు స్వీపర్,అటెండర్ లేకపోవడం వలన అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనిఅన్నారు.మరుగుదొడ్లు శుభ్రం చేసే వారు ఎప్పుడో వారంలో ఒకసారి శుభ్రం చేసి వెళ్లిపోతున్నారని, దీనివల్ల దుర్వాసన వస్తుందని రానున్న వర్షాకాలంలో దీనివల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వెంటనే పాఠశాలకు ఒక స్వీపర్ ను అటెండర్ ను నియమించాలని డిమాండ్ చేశారు.
స్కూల్లో తమ దృష్టికి వచ్చే సమస్యలపై డిఈఓ దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులందరికీ సమీకరించి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష ఉపాధ్యక్షులు కందుల నాగరాజు,కంతి విక్రం,సభ్యులు కాముని ప్రణయ్,ప్రదీప్,శ్రీకాంత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు
.