సూర్యాపేట జిల్లా: దళిత బంధు పథకంలో 30% ఎమ్మెల్యేలు లంచాలు తీసుకున్నారని స్వయంగా కేసీఆరే అన్నారని,దీనితో బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు అందరూ లంచావతారులేనని తేటతెల్లం అయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి చల్లా శ్రీలతా రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో అభ్యర్డితో కలిసి పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కుటుంబ పాలనలో బందీ అయిందన్నారు.నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో నిధులు పంపితే తెలంగాణ ప్రభుత్వం ఆ నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.
ధరణి పోర్టల్ తీసుకువచ్చి అసైన్డ్ భూములు రిజిస్టర్ చేయలేదని,ధరణి పోర్టల్ డబ్బులు విత్ డ్రా చేసుకున్నారన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు 30 కోట్ల నిధులు అంచనా ఉంటే లక్ష 30 కోట్లకు అంచనా విలువ పెంచి దోపిడి మొదలుపెట్టారని,ఆ ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని అన్నారు.
కేంద్రంలో ప్రధానమంత్రి ఇండ్లు ఇస్తుంటే ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదన్నారు.యువతకు ఉపాధి కల్పించాలన్నా, రైతులకు భరోసా ఇవ్వాలన్నా బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా వేలాది మంది యువతను బలితీసుకుదని,
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించడానికే ఉన్నాయన్నారు.మోడీ ప్రభుత్వం హయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదవ స్థానంలో ఉందిని,రానున్న కాలంలో మూడో స్థానానికి వస్తుందని,వ్యవసాయానికి గత పది సంవత్సరాల కాలంలో ఆరు రేట్లు పెంచి బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగిందన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు.బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని,కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఇంటికి పంపించి,బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు.