సూర్యాపేట జిల్లా:జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.శనివారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
నిత్యం భూముల రిజిస్ట్రేషన్ క్రయవిక్రయాలకు సంబంధించిన పనుల నిమిత్తం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు మంచినీటి వసతి,కూర్చోవడానికి కుర్చీలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ప్రభుత్వం స్పందించి పక్కా భవనాలు నిర్మించడంతో పాటు, మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
వేసవి కాలం ప్రారంభం కావడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తాగునీటి వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు.మౌలిక వసతులతో పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.