హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు దోచుకుతింటున్నారో ప్రజలు చూస్తున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.కమీషన్ల కోసం ప్రాజెక్టుల రీడిజైన్ చేసింది నిజం కాదా?అంటూ ప్రశ్నించారు.నైని కోల్ బ్లాక్ టెండర్ ప్రక్రియ సక్రమంగా జరగ లేదని ఆరోపించారు.2014కు ముందు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆస్తి ఎంత? ఇప్పుడెంత? అన్నది చెప్పాలన్నారు.నైని కోల్ మైన్ విషయంలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు.దొంగ పనులు చేసుకుంటూ బీజేపీని, కాంగ్రెస్ ను తిడుతున్నారని ఎద్దేవా చేశారు.







