యాదాద్రి భువనగిరి జిల్లా: విధి నిర్వహణలో భాగంగా మీడియా కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్టులపై దాడి చేసిన ఇటుక బట్టి యజమానులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.బుధవారం ఇటుక బట్టీలో పని చేసే ఓ ఒడిశా కార్మికుడు మృతి చెందింది ఘటనను కవరేజ్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టుల పట్ల ఇటుక బట్టీ యాజమాన్యం దురుసుగా ప్రవర్తిస్తూ,దాడి చేయడాన్ని నిరసిస్తూ గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి బొమ్మలరామారం తహసిల్దార్ పద్మ సుందరికి మరియు ఎస్ఐకి మండల జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు.

జర్నలిస్టుల నిరసనకు మండల ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ మైలారం జంగయ్య, సిపిఎం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం,పున్నమ్మ లక్ష్మయ్య,యాదయ్య తదితరులు మద్దతు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఏల్లబోయిన శ్రీహరి,జూపల్లి బాలకృష్ణ, పోలగోని కరుణాకర్ గౌడ్, భూపాల్,ఈటబోయిన బాలకృష్ణ,గాదే బాలరాజ్, నిమ్మ వెంకట నరసింహారెడ్డి,ఇప్పలపల్లి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.