సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణంలోని 16,17,18 వార్డుల్లో మంగళవారం రాత్రి భారీ శబ్దంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది.ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మత్తులు చేయక ఆయిల్ తక్కువై పక్కన ఉన్న ఎర్త్ వైర్ తెగిపోయి ఒక్కసారిగా విద్యుత్తు హై వోల్టేజ్ వచ్చింది.
దీని కారణంగా దాదాపు 20 ఇళ్లలో ఫ్రిజ్లు,
టీవీలు, తాగునీటి మోటార్లు,ఆ సమయంలో ఛార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్లు కాలిపోయి లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆయా కాలనీల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమకు నష్టం జరిగిందని,అందుకే తమకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.