1.నేడు బీజేపీ విజయ సంకల్ప సభ

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత భారీ బహిరంగ సభను ఈరోజు సాయంత్రం సికింద్రాబాద్ పైరేట్ గ్రౌండ్ లో నిర్వహించనున్నారు.
2.నేడు సాధారణంగానే మెట్రో రైళ్లు
హైదరాబాద్ లో నేడు మెట్రో రైలు సాధారణంగానే నడవనున్నట్లు మెట్రో ఎండి ఎన్ వి ఎస్ రెడ్డి తెలి పారు.
3.నుపూర్ శర్మ పై లుకౌట్ సర్క్యులర్

బిజెపి బహిష్కృత నాయకురాలు నుపూర్ శర్మ పై కోల్ కతా పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.
4.మహారాష్ట్ర అసెంబ్లీలో నేడే బలపరీక్ష
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన షిండే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిన నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీలో నేడు బల పరీక్ష జరగనుంది.
5.నేడు బిజెపిలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి నేడు బిజెపిలో చేరబోతున్నారు.
6.ఈటెల రాజేందర్ కు అనుకూలంగా తీర్పు

బిజెపి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబం కు చెందిన జమన హెచరీస్ కు హైకోర్టులో ఊరట లభించింది.జమున హేచరీస్ కు సంబంధించిన భూములపై ఆగస్టు ఒకటో తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్టే ఇచ్చింది.
7.మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా రాహుల్ నార్వేకర్
మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ గా బిజెపి ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు.
8.రేపు ప్రధాని మోది కి స్వాగతం పలకనున్న జగన్

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా జులై 4న ప్రధాని మోదీ ఏపీ కి రానున్నారు.ప్రధానికి ఏపీ సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు.
9.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 16,103 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
10.ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ విద్య లో భాగంగా ఎంపీసీ , బైపీసీ, ఎంఈసి, సీఈసీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ సరి చేశారు.
11.దివ్యాంగులను ఆదుకోవాలి
జనవాణి జనసేన కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడలో నిర్వహించిన జనాసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కొంతమంది దివ్యాంగులు కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు.ఈ సందర్భంగా దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకుని వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పవన్ కళ్యాణ్ కోరారు.
12.భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం

పాతబస్తీలోని భాగ్యలక్ష్మి దేవాలయం కు యోగి ఆదిత్యనాథ్ వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.
13.దక్షిణ్ ఎన్నికల ప్రెస్ లో మంటలు
భువనగిరి సమీపంలోని పరిగిడిపల్లి రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న దక్షిణ ఎక్స్ ప్రెస్ బోగి లో మంటలు చెలరేగాయి.వెంటనే రైలుని నిలిపివేసి మంటలను అదుపు చేశారు.
14.సప్లిమెంటరీ లో పాస్ అయినా రెగ్యులరే

అడ్వాన్స్ సప్లమెంటరీ లో పాసైన విద్యార్థులను కూడా రెగ్యులర్ గానే భావిస్తామని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
15.మూడు స్టేషన్లలో మెట్రో నిలిపివేత
ప్రధాని నరేంద్ర మోడీ సభ ఈ రోజు సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరగబోతున్న నేపథ్యంలో ప్యారడైజ్, పెరేడ్, జెబీయేస్ స్టేషన్ లలో మెట్రో సర్వీసులను సాయంత్రం నిలిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
16.కాంగ్రెస్ లోకి పెరిగిన వలసలు : మల్లు
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ లోకి వలసలు భారీగా పెరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు.
15.విజయవాడ కనకదుర్గమ్మ కు తెలంగాణ బంగారు బోనం

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కనకదుర్గమ్మకు హైదరాబాదులోని మహంకాళి జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు బంగారు బోనం సమర్పించారు.
16.విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో మార్పులు
హోం మంత్రిత్వ శాఖ విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో మార్పులు చేసింది.విదేశాల్లో ఉన్నవారి నుంచి భారత్ లో ఉన్నవారు ఏడాదికి 10 లక్షలు వరకు నగదును అందుకునే వెసులుబాటును కల్పించారు.
17.ప్రధాని సభకు 5000 మందితో బందోబస్తు
సికింద్రాబాద్ ఫేరేట్ గ్రౌండ్స్ లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభ కోసం ఐదు వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
18.ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి గా అమరిందర్ సింగ్

ఉపరాష్ట్రపతి గా ఎన్డీఏ తరఫున పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
19.పారిస్ నుంచి ఏపీకి తిరిగి వచ్చిన జగన్
రెండు రోజుల పర్యటన నిమిత్తం పారిస్ వెళ్ళిన ఏపీ సీఎం జగన్ ఈరోజు ఉదయం ఏపీకి తిరిగి వచ్చారు.
20.ఈరోజు బంగారం ధరలు