సూర్యాపేట జిల్లా:స్వతంత్ర సమర యోధుడు,తెలంగాణ సాయుధ పోరాట యోధుడు,మాజీ ఎంపీ అమరజీవి కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 12వ వర్ధంతిని ఆదివారం ధర్మభిక్షం చౌక్ ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ముఖ్యాతిథిగా హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు,మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ,జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,జెడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ,మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, మారిపెద్ది శ్రీనివాస్, కౌన్సిలర్లు రాపర్తి శ్రీనివాస్, అనంతుల యాదగిరి, సిపిఐ పార్టీ నాయకులు చామల అశోక్,బొమ్మగాని శ్రీనివాస్,అనంతుల మల్లీశ్వరి,దంతాల రాంబాబు,మూరగొండ్ల లక్ష్మయ్య,బూర వెంకటేశ్వర్లు,బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైరు వెంకన్న,బూరబాల సైదులు,కక్కిరేణి నాగయ్య,కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు,పార్టీ శ్రేణులు విద్యార్థి,యువజన సంఘాల నేతలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
.