1.రాహుల్ గాంధీ కామెంట్స్
తెలంగాణతో తన కుటుంబానికి సంబంధం ఉందని అందుకే నా చెల్లెలు అని ఇక్కడకు తీసుకువచ్చానని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు.
2.ప్రియాంక గాంధీ పై కవిత విమర్శలు
గాంధీ ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి మాట్లాడడం ఈ ఎన్నికల ప్రచారంలో అతిపెద్ద జోక్ అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
3.చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను నవంబర్ 1 వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది.
4 .కాంగ్రెస్ బైక్ ర్యాలీ
తెలంగాణలోని భూపాలపల్లి లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
5.కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్
కెసిఆర్ తమ పార్టీ పథకాలను కాపీ కొట్టారని అందులో డౌటే లేదని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.
6.షర్మిల విమర్శలు
టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పనిచేస్తుందన్న కేటీఆర్ ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ప్రక్షాళన అంటున్నారని , అంటే చిన్న దొర తప్పు అంగీకరించినట్లేనా అని వైయస్సార్ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
7.మంత్రి కేటీఆర్ విమర్శలు
కాంగ్రెస్ బస్సు యాత్రపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు .కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయమని కేటీఆర్ విమర్శించారు.
8.అజారుద్దీన్ పై మరో కేసు నమోదు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ మరో కేసు నమోదయింది.అజహార్ నేతృత్వంలోని గత హెచ్సిఏ పాలకవర్గం అవినీతికి పాల్పడిందని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సీఈఓ సునీల్ కాంతే ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
9.టిఆర్ఎస్ కు గ్యాస్ సిలిండర్ కేటాయింపు
తెలంగాణ శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల గుర్తుగా గ్యాస్ సిలిండర్ కేటాయించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
10.ధనుంజయ రెడ్డితో బాలినేని భేటీ
ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎంవో ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డితో సమావేశం అయ్యారు.
11.రాహుల్ విమర్శలు
ఇది ప్రజల తెలంగాణ కాదు, దొరల తెలంగాణ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బిఆర్ఎస్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.
12.దివ్యాంగుల పింఛన్ పై కేటీఆర్ కామెంట్స్
దివ్యాంగుల పింఛన్ పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు 200 పింఛన్ ఇస్తోందని అదే తెలంగాణ 4,016 ఇస్తున్నామని అంటే 20 రెట్లు ఎక్కువ అని కేటీఆర్ అన్నారు.
13.సామాజిక న్యాయ బస్సు యాత్ర నిర్వహిస్తాం
సామాజిక న్యాయ బస్సు యాత్ర రాష్ట్ర మంతటా నిర్వహిస్తామని వై నీడ్ ఏపీ సీఎం జగన్ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
14.బైక్ నుంచి కింద పడిన కొండా సురేఖ
రాహుల్ గాంధీ బస్ యాత్ర లో అపశృతి చోటుచేసుకుంది.బైక్ ర్యాలీ లో పాల్గొన్న కొండా సురేఖ అదుపు తప్పి కిందపడిపోయారు.దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
15.కిషన్ రెడ్డి విమర్శలు
తెలంగాణలో బిజెపి , బీఆర్ఎస్, ఎం ఐ ఎం కలిసి పనిచేస్తున్నాయని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
16.త్రిపుర గవర్నర్ గా ఇంద్రసేనారెడ్డి
త్రిపుర గవర్నర్ గా బిజెపి సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి నియమితులయ్యారు.
17.ఆస్కార్ ప్రతిష్టాత్మక జాబితాలో ఎన్టీఆర్ కు చోటు
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది.ఆర్ఆర్ ఆర్ చిత్రంతో ఆస్కార్ వేదికపై సందడి చేసిన తారక్ అదే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ లో కొత్త సభ్యుడిగా ఎంపికయ్యారు.
18.రేవంత్ రెడ్డి కామెంట్స్
సింగరేణి ఎన్నికలు జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
19.మార్గదర్శి చిట్ ఫండ్స్ పై సిఐడి వేసిన పిటిషన్ సస్పెండ్
మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాలు ఫ్రిజ్ చేయాలన్న సిఐడి ఫిటిషన్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది.
29.కేసీఆర్ విమర్శలు
కాంగ్రెస్ చేసిన పొరపాటు వల్లే 60 ఏళ్లు గోసపడ్డాం.ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.