సూర్యాపేట జిల్లా:జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రొత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు.బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి మూడు రోజుల పాటు నిర్వహించు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్,ఎస్పీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోమేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలో సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు కట్టుదిట్టంగా నిర్వహించాలని,16న ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే ర్యాలీ రూట్ మ్యాప్ తయారు చేయాలని సూచించారు.నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధుల సహకారంతో 15 వేల మందితో భారీ ర్యాలీ,సమావేశం నిర్వహించాలని,ప్రజలందరికి నాణ్యమైన ఆహారం అందించాలని పేర్కొన్నారు.భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతున్న నేపథ్యంలో భోజనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని,అధిక సంఖ్యలో కౌంటర్లు మండలాల వారీగా ఏర్పాటు చేయాలని సూచించారు.17న జిల్లా కేంద్రాల్లో ముఖ్య అతిథిచే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని,హైదరాబాద్ లో జరిగే ఆదివాసీ భవన్,బంజారా భవన్ ప్రారంభానికి జిల్లాకు కేటాయించిన లక్ష్యాల మేరకు ఎస్టీలను తరలించాలని,బస్సు,భోజన సౌకర్యాలు కల్పించేందు అదనపు నిధులు విడుదల చేశామని తెలిపారు.సెప్టెంబర్ 18న జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని,ప్రముఖ కళాకారులను, స్వాతంత్ర సమరయోధుల సన్మానం చేయాలని పేర్కొన్నారు.జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన భవనాలు ట్రై కలర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ మాట్లాడుతూ 16న జిల్లాలో ఉన్న 4 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గంలో 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసామని,స్థానిక ఎమ్మెల్యే,మంత్రితో సమన్వయం చేసుకొని ర్యాలీ విజయవంతం చేస్తామని కలెక్టర్ తెలిపారు.ర్యాలీ అనంతరం భోజనం ఏర్పాటు కోసం అవసరమైన మేర కౌంటర్లు ఏర్పాటు చేసామని,ప్రతి కౌంటర్ వద్ద 4 అధికారులకు బాధ్యత అప్పగించామని,ఎలాంటి పోరపాట్లు జర్గకుండా కట్టుదిట్టమైన బ్యారి కేడ్లు సిద్దం చేశామని తెలిపారు.17న జిల్లాలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని,జిల్లా నుంచి 1,157 మంది ఎస్టీ ప్రతినిధులను,ఎస్టీ ఉద్యోగులు 843,లైసన్ ఆఫీసర్లు 90 మంది,పోలీసు సిబ్బంది 45 మంది,45బస్సుల ద్వారా మండల కేంద్రాల నుంచి తరలిస్తున్నామని,వారికి అవసరమైన త్రాగునీరు,భోజన,స్నాక్స్ సౌకర్యాలు ఏర్పాటు చేసామని,సకాలంలో హైదరాబాద్ చేరే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.సెప్టెంబర్ 18న జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేశామని,జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన భవనాలు ట్రై కలర్ లైటింగ్ సుందరికరణ పనులు చేపట్టామని కలెక్టర్ తెలిపారు.
ఎస్టీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలలో గిరిజన సమ్మేళనంపై హోర్డింగులు,పోస్టర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు,జెడ్పి సీఈఓ సురేష్ కుమార్, డిఆర్డీఓ కిరణ్ కుమార్,సిపిఓ వెంకటేశ్వర్లు,అడిషనల్ పిఆర్ఓ ఏ.రమేష్ కుమార్,డిపిఓ యాదయ్య, కలెక్టరేట్ ఏవో శ్రీదేవి,అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.